ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరోసారి విషమించింది

0
41
balu health critical

టాలీవుడ్ మూవీ న్యూస్,చెన్నైఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరోసారి విషమించింది. గతకొంత కాలంగా చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాలు. అయితే నాలుగు రోజుల క్రితం బాలు కోలుకున్నట్లు ధ్రువీకరించిన డాక్టర్లు ఈరోజు సాయంత్రం మళ్ళీ బాలు ఆరోగ్యం విషమించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ప్రస్తుతం బాలు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని , ఎక్మో , వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని కానీ సడెన్ గా అనారోగ్యం తిరగబెట్టడంతో డాక్టర్లు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. కరోనా జయించిన తర్వాత ఇక బాలు కోలుకున్నట్లే అనుకున్నారు కానీ ఇంకా బాలు ఆరోగ్యం మెరుగుపడలేదు. అయితే కాస్త ఫరవాలేదు అని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఈరోజు మళ్ళీ బాలు ఆరోగ్యం విషమించినట్లు తెలిపారు డాక్టర్లు. ఆగస్టు 5 నుండి బాలు చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికి 40 రోజులకు పైగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు బాలు.
బాలు త్వరగా కోలుకోవాలని యావత్ చిత్ర పరిశ్రమ ప్రార్ధనలు చేసింది. టాలీవుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ , బాలీవుడ్ ఇలా అన్ని రంగాల వాళ్ళు బాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఎప్పటికప్పుడు బాలు తనయుడు చరణ్ బాలు ఆరోగ్యం గురించి మీడియాకు చెబుతూనే ఉన్నాడు. బాలు కోలుకున్నట్లే అని అనుకుంటున్న సమయంలో ఆరోగ్యం విషమించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేసి బాలు అభిమానులను తీవ్ర మనోవేదనకు గురి చేసారు . 

మునుపటి వ్యాసంఅభినందన్ వర్ధమాన్ పాత్రలో విజయ్ దేవరకొండ
తదుపరి ఆర్టికల్కొడాలి నాని బర్తరఫ్ కు బీజేపీ డిమాండ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి