సారీ చెప్పిన బండ్ల గణేష్

0
46

నటుడు , నిర్మాత బండ్ల గణేష్ మెగా ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు. ఇంతకీ బండ్ల గణేష్ ఎందుకు సారీ చెప్పాడో తెలుసా…… పొరపాటున ఓ వీడియోకు లైక్ కొట్టాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే…… రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన బ్రదర్స్ వీడియో అది. బ్రదర్స్ అంటే మెగా బ్రదర్స్ అన్నమాట. చిరంజీవి , పవన్ కళ్యాణ్ పొలికలతో ఉన్న పవర్ స్టార్ చిత్రం లోని ఓ సన్నివేశం తాలూకు  వీడియో . యధావిధిగా వచ్చిన వీడియోని ఏ మాత్రం చూడకుండా లైక్ కొట్టాడు. దాంతో షాక్ అవ్వడం మెగా ఫ్యాన్స్ వంతు అయ్యింది. పవన్ కళ్యాణ్ భక్తుడు ఆయిన బండ్ల గణేష్ ఇలా లైక్ కొట్టడం ఏంటి అని షాక్ అయిన ఓ అభిమాని గట్టిగా నిలదీసాడు దాంతో జరిగిన పొరపాటుని గమనించి మెగా ఫ్యాన్స్ కు సారీ చెప్పాడు.

బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టం . దాంతో అతడితో రెండు సినిమాలు తీసాడు. తీన్ మార్ , గబ్బర్ సింగ్ . అయితే గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా తీన్ మార్ మాత్రం ప్లాప్ అయ్యింది. ఇక అప్పటి నుండి మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు కానీ కుదరడం లేదు పాపం. ఇక ఇటీవల కరోనాతో బాధపడ్డాడు బండ్ల గణేష్. కరోనా నుండి కొలుకున్నాక ఇక నుండి కోప తాపాలకు తావు లేదని , అందరితో కలిసి మెలిసి ఉంటానని అన్నాడు. ఈలోపే ఇలా ఒక వివాదంలో ఇరుక్కుని సారీ చెప్పాడు పాపం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి