సోనూ సుద్ పై ప్రశంసల వర్షం

0
45

బాలీవుడ్ నటుడు సోనూ సుద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది దేశ వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లి మండలానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతుకు ఏకంగా 8 లక్షల విలువ చేసే కొత్త సోనాలిక ట్రాక్టర్ కొని ఇచ్చాడు దాంతో దేశ వ్యాప్తంగా ఈ వార్త ట్రెండ్ అవుతోంది. నాగేశ్వరరావు కు ఒక భార్య ఇద్దరు కూతుర్లు కాగా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి చేరుకున్నాడు. ఉన్న కాస్త పొలంలో వ్యవసాయం చేయాలని అనుకున్నాడు అయితే ఎద్దులకు , అలాగే  ట్రాక్టర్ కు కూడా ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో తన ఇద్దరు కుతుర్ల ని కాడికి కట్టి పొలం దున్నాడు.

ఈ సంఘటన వీడియో తీసి మీడియాకు పంపించడంతో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన నటుడు సోనూ సుద్ చలించిపోయాడు. వెంటనే సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. కొంతమంది మాట ఇచ్చి మర్చిపోతారు , మరికొంతమంది ఆలస్యంగా హామీ నెరవేర్చుకుంటారు. కానీ సోనూ సుద్ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే నాగేశ్వరరావు వివరాలు తెలుసుకోవడమే కాకుండా కేవలం 3 గంటల్లోనే …… హామీ ఇచ్చిన 3 గంటల్లోనే ట్రాక్టర్ ని ఇంటికి పంపించాడు. దాంతో షాక్ అవ్వడం ఆ కుటుంబం వంతు అయ్యింది. వెంటనే స్పందించి 8 లక్షల విలువ గల ట్రాక్టర్ ని అందించిన సోనూ సుద్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. లాక్ డౌన్ సమయంలో పలువురు వలస కార్మికులను తమ తమ స్వస్థలాలకు తన స్వంత ఖర్చులతో పంపించడమే కాకుండా ముంబయి లోని ఖరీదైన తన హోటల్ ని వలస కార్మికులు బస చేయడానికి అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేశాడు. అలాగే విదేశాలలో ఉన్న స్టూడెంట్స్ ని చాలామందిని తన స్వంత ఖర్చులతో ఇండియాకు రప్పించాడు. అంతేనా నిన్నటి రోజునే వరంగల్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటుంటే సహాయం చేస్తానని హామీ ఇచ్చారు కూడా. ఇలాంటి ఎన్నో సహాయలు చేస్తూ మహా మనిషిగా ఎదిగాడు సోనూ సుద్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి