సోనూ సుద్ ఇప్పటి వరకు ఎన్ని కోట్ల దానం చేసాడో తెలుసా

0
43

సోనూ సుద్ కు మొత్తంగా 130 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఇప్పటికే 10 కోట్లు దానధర్మాలకు ఖర్చు పెట్టాడట. ఈ 10 కోట్లు కూడా ఖర్చుపెట్టింది ఎప్పుడో తెలుసా…….లాక్ డౌన్ సమయంలోనే. గత నాలుగు నెలల కాలంలో దాదాపుగా 10 కోట్లు ఖర్చు పెట్టాడు దాన ధర్మాలకు. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో కోట్లాది మంది వలస కూలీలు కాలినడకన బయలుదేరారు తమతమ స్వస్థలాలకు. ఎవరూ కనికరించకుండా పోవడంతో పిల్లలను , ఇతర వస్తువులను నెత్తిన పెట్టుకొని వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. వలస కార్మికుల వెతలు చూసి చలించిన సోనూ సుద్ పెద్ద సంఖ్యలో తన స్వంత ఖర్చులతో బస్సులను వేసి వలస కార్మికులను స్వగ్రామలకు పంపించాడు.

అంతేకాదు చాలామంది కార్మికులకు తన హోటల్ లో బస ఏర్పాట్లు చేసి భోజన , వసతి సౌకర్యాలు కల్పించాడు. ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆర్ధిక సహాయం అందించాడు. అలాగే విదేశాలలో ఉన్న స్టూడెంట్స్ ని ఇండియాకు విమానంలో రప్పించాడు. వరంగల్ యువతికి వ్యక్తిగతంగా సహాయం అందించాడు. అలాగే ఏపీ కి చెందిన వ్యక్తికి ట్రాక్టర్ ని కేవలం 3 గంటల్లోనే అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. మొత్తానికి సినిమారంగంలో కానీ , రాజకీయ రంగంలో కానీ వేల కోట్ల ఆస్తులు ఉన్నవాళ్లు చేయని పని కేవలం 130 కోట్ల ఆస్తి ఉన్న సోనూ చేసాడు. అది కూడా కేవలం 4 నెలల కాలంలోనే 10 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు ప్రజల కోసం. దాంతో ఒక్కసారిగా సోనూ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. సోనూ సుద్ ని పొగడని వాళ్ళు లేరంటే నమ్మండి అంతగా ప్రభావితం చేస్తున్నాడు సోనూ. సినిమాల్లో విలన్ గా నటించే సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి