స్కాలర్ షిప్ ఇస్తానంటున్న సోనూ సూద్

0
29
real hero sonusood

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబయి-  బాలీవుడ్ విలన్ సోనూ సూద్ సేవా కార్యక్రమాలతో ఇండియన్ హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. తెరమీద విలన్ పాత్రల్లో ప్రేక్షకులను అలరించే సోనూ మనసు నిజంగా బంగారం అని లాక్ డౌన్ సమయంలో నిరూపితమైంది. తాజాగా ఉన్నత చదువులు చదివే స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్ ఇస్తానని మాట ఇచ్చి మరింత సంచలనం సృష్టించాడు. దేశ వ్యాప్తంగా ఉన్న మెరిట్ విద్యార్థులు స్కాలర్ షిప్ కు అప్లయ్ చేసుకుంటే వాళ్లకు అన్నిరకాలుగా ఉపయోగపడేలా స్కాలర్ షిప్ మంజూరు చేస్తానని అందుకు ఈరోజు నుండి 10 రోజుల లోపు అప్లికేషన్ పెట్టుకోవాలని ట్వీట్ చేసాడు సోనూ సూద్.

దేశ వ్యాప్తంగా మెడిసిన్ , ఇంజనీరింగ్ , ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్ , రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ , సైబర్ సెక్యూరిటీ , డాటా సైన్స్ , ఫ్యాషన్ , జర్నలిజం , బిజినెస్ స్టడీస్ , వంటి కోర్సులు చేయాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్ షిప్ అందిస్తానని అయితే మంచి మార్కులు రావడంతో పాటుగా 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అప్లయ్ చేసుకోవాలని కోరాడు. ఈ స్కాలర్ షిప్ తన తల్లి ప్రొఫెసర్ సరోజ్ సూద్ పేరు మీద ఇవ్వడానికి నిర్ణయించాడు సోనూ.

స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్ళు scholarships@sonusood.me లో దరఖాస్తు చేసుకోవాలని కోరాడు సోనూ సూద్. పంజాబ్ విద్యార్థులకు మా అమ్మ ఉచితంగా చదువు చెప్పిందని అందుకే ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నాడు సోనూ. కరోనా సమయంలో భారతదేశంలో ఏ సెలబ్రిటీ కూడా చేయలేని పనులను చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. త్వరలోనే దేశ వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు సోనూ . మొత్తానికి పలు సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అయ్యాడు సోనూ సూద్. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి