మాజీ భర్తని తల్చుకుంటున్న సోనియా అగర్వాల్

0
20
హీరోయిన్ సోనియా అగర్వాల్ తన మాజీ భర్తని తల్చుకుంటోంది. ఇంతకీ ఇన్నాళ్లకు మాజీ భర్తని ఎందుకు తల్చుకుంటుందో తెలుసా….. సోనియా అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమై 17 ఏళ్ళు అవుతోంది. 2003 లో తమిళంలో వచ్చిన కాదల్ కొండెన్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సోనియా అగర్వాల్. ధనుష్ హీరోగా నటించగా సోనియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సెల్వ రాఘవన్. ఒకవైపు ఆన్ స్క్రీన్ రొమాన్స్ ధనుష్ తో చేస్తూనే ఆఫ్ లైన్ లో సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది. దాంతో 2008 లో సెల్వ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది సోనియా అగర్వాల్.అయితే పెళ్ళైన రెండేళ్ళకే తీవ్ర విబేధాలతో విడాకులు తీసుకున్నారు. సెల్వ రాఘవన్ మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు . ఇక ఇప్పుడు తన మాజీ భర్తని ఎందుకు తల్చుకుందో తెలుసా…… తనని హీరోయిన్ గా పరిచయం చేసింది అతడే! అలాగే అప్పుడే నేను హీరోయిన్ గా పరిచయమై 17 ఏళ్ళు అయ్యిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది సోనియా అగర్వాల్. తెలుగులో ఈ భామ నటించిన 7 / జి బృందావన్ కాలనీ సంచలన విజయం సాధించింది. ఆ సినిమా ఈ భామకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ ఆ స్థాయి గుర్తింపు అయితే లభించలేదు.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి