హీరో ఇమేజ్ ని కొంతమంది బాగానే వాడుకుంటున్నారట

0
50
vijay devarakonda

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ లో క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ. దాంతో ఈ హీరో ఇమేజ్ ని కొంతమంది బాగానే వాడుకుంటున్నారట. మా దగ్గర విజయ్ దేవరకొండ డేట్స్ ఉన్నాయి , విజయ్ దేవరకొండ తర్వాతి సినిమా మా బ్యానర్ లోనే అంటూ కొంతమంది అదేపనిగా ప్రచారం చేసుకుంటూ ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నారట. అయితే ఈ విషయాలు అంత తొందరగా విజయ్ దేవరకొండ చెవిన పడవు కదా ! కాస్త ఆలస్యంగా విజయ్ దేవరకొండ చెవిన పడ్డాయి దాంతో అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని భావించి తన పీఆర్ టీమ్ తో ఓ ప్రకటన చేయించాడు.

నాతో సినిమా చేస్తున్నాం , లేకపోతే విజయ్ దేవరకొండ డేట్స్ ఇప్పిస్తామని కొంతమంది చెప్పుకుంటూ క్యాష్ చేసుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చిందని , అయితే నా తదుపరి సినిమాల వివరాలు నేను అధికారికంగా చెబుతాను లేదంటే నా దర్శక నిర్మాతలు వెల్లడిస్తారు అంతేకాని మాకు సంబంధం లేకుండా ఎవరైనా చెప్పుకుంటే మాకు సంబంధం లేదు అలాగే అలాంటి వాళ్లపై తప్పకుండా చర్యలు చేపడతాను అంటూ ఓ ప్రకటన విడుదల చేసాడు విజయ్ దేవరకొండ.

తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు ముంబైలో షూటింగ్ జరిగింది. కరోనా లేకపోతే ఈపాటికి షూటింగ్ అయిపోయేది. త్వరలోనే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ చేసేలా చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయ్యాక తన తదుపరి సినిమా ఏంటి అన్నది తేలాల్సి ఉంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి