సొగసు చూడ తరమా చిత్రానికి 25 ఏళ్ళు

0
31

సీనియర్ నరేష్ -ఇంద్రజ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సొగసు చూడ తరమా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం సొగసు చూడ తరమా విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా బహుళ ప్రజాదరణ పొందింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. సినిమా హిట్ కావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సైతం అందుకుంది. ఉత్తమ చిత్రంగా , ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు తో పాటుగా కాస్ట్యూమ్స్ కూడా నంది అవార్డు లభించింది. మూడు నంది అవార్డులు లభించడంతో ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు దర్శకుడు గుణశేఖర్.

లాఠీ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు గుణశేఖర్. ఆ సినిమా విజయవంతం కాలేదు కానీ మంచి పేరు తీసుకొచ్చింది దర్శకుడిగా. ఆ తర్వాత చేసిన చిత్రమే ఈ సొగసు చూడ తరమా. ఈ సినిమా విజయవంతం అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ ని బాల నటుడిగా పరిచయం చేస్తూ రామాయణం అనే సాహసోపేత చిత్రం చేసాడు గుణశేఖర్. ఆ సినిమా కూడా అవార్డులను తెచ్చి పెట్టడమే కాకుండా ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ఒక్కడుతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు గుణశేఖర్. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కేవలం 12 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు గుణశేఖర్.

మునుపటి వ్యాసంఅనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ?
తదుపరి ఆర్టికల్వేశ్యగా నటించడానికి సిద్ధమౌతున్న భామ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి