సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి ప్రగతి వీడియో

0
53
TMN logo
TMN logo

సీనియర్ నటి ప్రగతి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో పలు చిత్రాల్లో హీరోలకు అమ్మ గానో , అత్త గానో నటించి హోమ్లీ ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రగతి. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , ప్రభాస్ , అల్లు అర్జున్ , రాంచరణ్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో రకరకాల పాత్రల్లో నటించింది ప్రగతి. అయితే ఆమె వెండితెర మీద పోషించిన పాత్రలు వేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వేరు దాంతో షాక్ అవ్వడం నెటిజన్ల వంతు అయ్యింది. ప్రగతి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో హల్చల్ చేస్తోంది.

డీప్ స్లీవ్ లెస్ టాప్ వేసుకొని ప్రగతి చేస్తున్న డ్యాన్స్ కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది. ఆమె అప్పియరెన్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అంతగా డ్యాన్స్ చేస్తోంది ప్రగతి. ఆమె హొయలు పోతున్న తీరుకు కళ్ళప్పగించి మరీ చూస్తున్నారు నెటిజన్లు. ప్రగతి అద్భుతమైన డ్యాన్సర్ అని తెలియని వాళ్లకు తాజాగా ఆమె చేస్తున్న డ్యాన్స్ అదరహో అనిపించేలా ఉంది. అలాగే ఇన్నాళ్లు ప్రగతి కి ఇచ్చిన పాత్రలు వేరని , మోడ్రన్ లుక్ లో అదిరిపోయేలా ఉంది కాబట్టి ఇలాంటి స్టైలిష్ పాత్రలు ఇస్తేనే బెటర్ అని భావిస్తున్నారు. అయితే కొంతమంది ప్రగతిని విమర్శించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే ఉన్నారు. అయితే పొగిడినా , విమర్శించినా డోంట్ కేర్ అనే రకం ప్రగతి. తన యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుందన్న విషయం సినిమా వాళ్లకు బాగానే తెలుసు . అందుకే చనువు తీసుకొని కామెంట్ చేసే ధైర్యం చేయరు సినిమారంగంల

మునుపటి వ్యాసంనటి రాధా ప్రశాంతి పై కేసు నమోదు
తదుపరి ఆర్టికల్పసివాడి ప్రాణం సంచలనానికి 33 ఏళ్ళు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి