స్మిత ఫేస్ బుక్ లో నగ్న ఫోటోల కలకలం

0
59

పాప్ సింగర్ స్మిత ఫేస్ బుక్ అధికారిక పేజీలో పలు నగ్న చిత్రాలు పోస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఫోటోలు , నగ్న వీడియోలు పోస్ట్ చేయడం అవి వైరల్ అవ్వడం జరిగింది. అయితే ఇదే సమయంలో తన ఫేస్ బుక్ లో జరిగిన పొరపాట్లు స్మిత కు తెలియడంతో వెంటనే అప్రమత్తమైంది. సంబంధిత అధికారులతో పాటుగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో స్మిత అకౌంట్ ని హ్యాకర్ల నుండి సేఫ్ గా మళ్లీ స్మిత కు అలాట్ అయ్యేలా చేశారు. దాంతో ఊపిరి పీల్చుకున్న స్మిత జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ పోస్ట్ చేసింది.

తెలుగునాట పాప్ సింగర్ గా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందింది స్మిత. అలాగే ఒకటి అరా సినిమాల్లో నటించింది కూడా. కానీ ఆ సినిమాలు స్మిత కు అంతగా ఉపయోగపడలేదు. అయితే పాటల ద్వారానే ఆర్ధికంగా మంచి ఉన్నత స్థితిలోకి వచ్చింది.ఇక పలువురు సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు కొంతమంది సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడం, రకరకాల బూతులు పోస్ట్ చేయడం సాధారణంగా మారింది. అయితే స్మిత ఫేస్ బుక్ ని హ్యాక్ చేసిన వాళ్ళని ఇంకా పట్టుకోలేదు కానీ హ్యాకర్ల నుండి మాత్రం తప్పించారు పోలీసులు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి