51 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శివగామి

0
19
ramyakrishna birthdaycelebrations

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  హాట్ భామ రమ్యకృష్ణ 51 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నిన్ననే 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది దాంతో 50 వ జన్మదిన వేడుకలను సన్నిహితుల సమక్షంలో జరుపుకుంది రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 15 న జన్మించిన రమ్యకృష్ణ కు సరిగ్గా 51 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయిలాగే కనిపిస్తోంది రమ్య. 50 ఏళ్ళు దాటినప్పటికీ తన గ్లామర్ ని కాపాడుకుంటూ నటిగా ఛాలెంజింగ్ పాత్రలను చేస్తూనే ఉంది. ఒకప్పుడు కెరీర్ తొలినాళ్ళలో ఐరన్ లెగ్ గా ముద్రపడింది. ఆ తర్వాత సక్సెస్ సాధించినప్పటికీ రమ్యకృష్ణ అంటే గ్లామర్ డాల్ మాత్రమే అన్న పేరు ఉండేది క్రమేణా గ్లామర్ డాల్ ని మాత్రమే కాదు సత్తా చూపించే పాత్ర లభించాలే కానీ నరసింహా చిత్రంలోని నీలాంబరి పాత్రతో యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకునేలా చేసింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీ పడి నటించడం అంటే మాటలు కాదు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది రమ్య. ఇక బాహుబలి చిత్రంలో శివగామిగా నభూతో నభవిష్యత్ అనేలా తన పాత్రని తీర్చి దిద్ది చూపించింది. రమ్యకృష్ణ సుదీర్ఘ నట జీవితంలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలను కలిపి మొత్తం 260 కి పైగా చిత్రాల్లో నటించింది. అయితే ఎక్కువగా నటించిన చిత్రాలు మాత్రం తెలుగు , తమిళం మాత్రమే.

2003 లో దర్శకులు కృష్ణవంశీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది రమ్యకృష్ణ. ఈ ఇద్దరికీ ఒక కొడుకు . రమ్యకృష్ణ చెన్నై లో స్థిరపడింది. ఇప్పటికి కూడా మంచి పాత్రలు వస్తే చేస్తూనే ఉంది. రమ్యకృష్ణ 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆమె ప్రస్నానాన్ని అలాగే తనకున్న సాన్నిహిత్యాన్ని గురించి ప్రస్తావిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందజేశాడు. రమ్యకృష్ణకు పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేసారు. 

మునుపటి వ్యాసంపెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో
తదుపరి ఆర్టికల్ఆర్ ఎక్స్ 100 నిర్మాతని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి