సింగర్ సునీత ఆగ్రహం

0
15
Singer Sunitha Seriously Tags KTR for Misusing Her Photos

సింగర్ సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటుగా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. సింగర్ సునీత కు ఇంతగా కోపం ఎందుకు వచ్చిందో తెలుసా …….. కనికా కపూర్ కు కరోనా సోకిందని వార్తలు రాసిన వాళ్ళు కనికా కపూర్ ఫోటో వాడకుండా సింగర్ సునీత ఫోటో బ్లర్ చేసి వాడారు. అయితే ఆ ఫోటో ఎక్కువ బ్లర్ చేయకపోవడంతో సింగర్ సునీత చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయితే ఇదే విషయం సునీత కంట పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలే కరోనా తో యావత్ ప్రపంచం అల్లల్లాడి పోతుంటే నాకు ఆ వ్యాధి సోకినట్లుగా ప్రచారం చేస్తారా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ లో చాలా ఫేమస్ అయిన సునీత పలు సూపర్ హిట్ గీతాలను ఆలపించి కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది అత్యుత్సాహం కలవాళ్ళు ఎవరికి ఈ కరోనా సోకిందో పూర్తిగా తెలుసుకోకుండానే ఇలా వ్యవహరిస్తుండటంతో అందరికీ ఇబ్బంది కలుగుతోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి