సిల్క్ స్మిత 24 సంవత్సరాల క్రితం ఇదే రోజున

0
35
silk smith death anniversary
టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- అందాల భామ సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్న రోజు ఇదే. సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆత్మహత్య చేసుకుంది సిల్క్ స్మిత. 1996 సెప్టెంబర్ 23 న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్న విషయం దావానలంలా వ్యాపించింది. ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ కి గురయ్యింది. కేవలం 35 ఏళ్ల వయసులోనే తిరిగి రాని లోకాలకు సెలవంటూ వెళ్ళిపోయింది, తాను నమ్మిన వాడు నట్టేట ముంచడంతో తీవ్ర మానసిక వేదనకు గురై తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని తనువు చాలించింది. ప్రేక్షకులను తన అందాలతో ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత కు ఆర్ధిక ఇబ్బందులా ? అంటూ జనాలు ముక్కున వేలేసుకునేలా చేసింది సిల్క్ మరణం.

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు లో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపట్ల. పేద కుటుంబంలో జన్మించిన విజయలక్ష్మి కి డబ్బు సంపాదించాలని , సినిమాల్లో వెలిగిపోవాలని ఆశించింది. ఆశించిందే తడవుగా అవకాశాలు రాలేదు కానీ పట్టుబట్టి సాధించింది అందుకు తన శరీరాకృతి కూడా బాగా కలిసి వచ్చింది. చక్కని శరీర సౌష్టవం అలాగే అంతకుమించిన పెద్ద పెద్ద కళ్ళు విజయలక్ష్మి ని విజయం వరించేలా చేసింది. దాంతో 1979 లో పుష్యరాగం అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం చేసింది.
ఆ తర్వాత సిల్క్ స్మితగా మారింది విజయలక్ష్మి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం , మలయాళం , కన్నడం , హిందీ ఇలా అన్ని భాషల్లో నటించింది సిల్క్ స్మిత. హీరో ఎవరైనా సరే సిల్క్ స్మిత ఐటెం సాంగ్ ఉందా ? లేదా ? అని చూసేవాళ్ళంటే సిల్క్ కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అయితే అనోహ్యమైన ఇమేజ్ రావడంతో సొంత సినిమాలు చేసింది. అవి కొన్ని అంతగా ఆడలేదు కొన్ని ఆడినా డబ్బులు నమ్మినవాడు ముంచేశాడు. ఇదే సమయంలో కొంతమంది స్టార్ హీరోలతో అడ్జెస్ట్ కాలేకపోయింది సిల్క్ దాంతో అవకాశాలు రాకుండా చేసారు. ఒకవైపు అవకాశాలు తగ్గుముఖం పట్టడం , ఆర్ధిక ఇబ్బందులు వాటికి తోడు నమ్మినవాడు నట్టేట ముంచడంతో డిప్రెషన్ కి లోనై మద్యం అతిగా సేవించింది. ఆ మద్యం మత్తులోనే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. తారల జీవితాలు అద్దాల మేడ లాంటివని సిల్క్ స్మిత జీవితం మరోసారి నిరూపించింది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి