వకీల్ సాబ్ భార్యగా శృతి హాసన్

0
22
shruti haasan again with pawan kalyan vakeel saab movie

అందాల భామ శృతి హాసన్ ని వకీల్ సాబ్ భార్యగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి బోనికపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. అమితాబ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ భార్య పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ పాత్ర చేయడానికి శృతి హాసన్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు పవన్ సరసన శృతి హాసన్ గబ్బర్ సింగ్ , కాటమ రాయుడు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం పింక్ లో చాలా మార్పులే చేశారట. పవన్ ఫ్యాన్స్ ని సంతోషపరిచే అన్ని మార్పులు చేసారు కాబట్టే వకీల్ సాబ్ గా పేరు పెట్టారు. ఇక చిత్రాన్ని మే 15 విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాసన్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతోంది. ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో జతకడుతోంది శ్రుతి హాసన్.

Image result for vakheel saab

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి