నగ్నంగా నటించడానికి రెడీ అంటున్న ప్రభాస్ భామ

0
42
shradha kapoor

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ తాజాగా ఓ రీమేక్ చిత్రంలో నగ్నంగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. శ్రద్దా కపూర్ పెద్దింటి అమ్మాయి. బాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో విలన్ గా నటించిన శక్తి కపూర్ కూతురే ఈ శ్రద్దా కపూర్. అలాంటి శ్రద్దా కపూర్ నగ్నంగా నటించడానికి సిద్ధమయ్యిందట. కథ ,పాత్ర డిమాండ్ చేస్తుండటంతో ఇలా నగ్నంగా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ శ్రద్దా కపూర్ నగ్నంగా కనిపించడానికి సిద్ధమైన సినిమా ఏంటో తెలుసా……… అమలా పాల్ నటించిన ఆమె చిత్రమే. అమలాపాల్ ఆమె చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.

కట్ చేస్తే ఆమె చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా అమలాపాల్ పాత్రలో శ్రద్దా కపూర్ నటించనుంది. కరోనా తగ్గిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించి మంచి మైలేజ్ పొందింది శ్రద్దా కపూర్. సాహో తెలుగులో అంతగా ఆడలేదు కానీ హిందీలో మాత్రం బాగానే ఆడింది. బయ్యర్లకు మంచిగానే డబ్బులు మిగిలాయి. సాహో ఇచ్చిన జోష్ తో మంచి జోరుమీదుంది ఈ భామ. దాంతో న్యూడ్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మునుపటి వ్యాసంచంద్రబాబు- వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ల ఫ్రెండ్ షిప్ పై వెబ్ సిరీస్
తదుపరి ఆర్టికల్ఆంటీ అని పిలుస్తుంటే అనసూయకు ఒళ్ళు మండుతోందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి