రియా అరెస్ట్ తప్పదా ?

0
34
riya ,shushanth

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబై  – సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ కాగా ఇప్పుడు రియా చక్రవర్తి కూడా అరెస్ట్ తప్పకపోవచ్చని తెలుస్తోంది. తన సోదరి రియా సూచనల మేరకే డ్రగ్స్ తీసుకొచ్చానని షోవిక్ వాంగ్మూలం ఇవ్వడంతో ప్రధాన సూత్రధారిగా రియా తేలింది దాంతో ఆమె అరెస్ట్ తప్పదని అంటున్నారు. ఇక రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి తీవ్ర భావోద్వేగానికి లోనై నా కొడుకుని అరెస్ట్ చేసారు , ఇక మిగిలింది నా కూతురు రియా ని అరెస్ట్ చేయడమే. ఆమె అరెస్ట్ తప్పకపోవచ్చు అని తెలుస్తోంది ఈ దేశానికి సేవ చేసినందుకు నాకు , నా కుటుంబానికి మంచి గిఫ్ట్ ఇచ్చారు అంటూ వ్యంగ్య బాణాలు సంధించాడు ఇంద్రజిత్ చక్రవర్తి.

గతకొద్ది రోజులుగా రియా చక్రవర్తితో పాటుగా ఆమె తండ్రి ఇంద్రజిత్ ని అలాగే సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఇంటరాగేట్ చేసిన పోలీసులు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేసారు. అలాగే రియా సన్నిహితుడు మిరాండా ని కూడా అరెస్ట్ చేసారు. అలాగే డ్రగ్స్ డీలర్ల ను కూడా అరెస్ట్ చేసారు దాంతో రియా మెడ చుట్టూ కేసు బిగుసుకుంది.

రియా చక్రవర్తి తెలుగులో తూనీగా తూనీగ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇక బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. అయితే సుశాంత్ కేసులో అడ్డంగా బుక్ అవ్వడంతో రియా కు న్యాయం జరగాలని పలువురు సెలబ్రిటీలు గళం విప్పారు. మంచు లక్ష్మీ ,విద్యాబాలన్ తదితరులు రియా చేసింది తప్పు అని తేలకుండానే ఆమెని దోషిగా చిత్రవధ చేయడం దారుణమని రియా కు అండగా నిలబడుతున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి