షాకింగ్ న్యూస్: హీరోయిన్ పై దాడి

0
22
kannada star samuyukath

షాకింగ్ న్యూస్ హీరోయిన్ పై దాడి చేశారు కొంతమంది మహిళలు. ఈ సంచలన సంఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడ హీరోయిన్ సంయుక్తా హెగ్డే బెంగుళూరు లోని ఓ పార్క్ లో డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తుండగా పబ్లిక్ పార్క్ లో బ్రా వేసుకొని డ్యాన్స్ చేస్తావా ? అంటూ పిడికిలి బిగించి కొట్టారు కొంతమంది మహిళలు. మీ సినిమావాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు , అలాగే పబ్లిక్ ప్లేస్ లలో అర్ధనగ్నంగా తిరగడం ఏంటి ? ఈ స్కిన్ షో చేయడం ఏంటి ? అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్తా హెగ్డే పై దాడి చేశారు. తనని అకారణంగా కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇంతకీ సంయుక్తా హెగ్డే చేసిన తప్పు ఏంటో తెలుసా…… బెంగుళూరు లోని పబ్లిక్ పార్క్ లో కేవలం పైన స్పోర్ట్స్ బ్రా మాత్రమే వేసుకుని రావడమే కాకుండా డ్యాన్స్ చేస్తుంటే ఆ స్పోర్ట్స్ బ్రా లోంచి అందాలు బహిర్గతం అవుతుంటే అసభ్యంగా కనిపించిందట. అంతేనా ఆమె వేసుకున్న స్కిన్ టైట్ స్పోర్ట్స్ ప్యాంట్ కూడా అభ్యంతరకరంగా ఉండటంతో ఇలాంటి బట్టలు వేసుకొని పబ్లిక్ లోకి ఎలా వస్తావు , రావడమే కాకుండా ఇలా అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్నావ్ అంటూ ఆవేశంతో దాడికి పాల్పడ్డారట.

సంయుక్త హెగ్డే తెలుగులో కూడా నటించింది. నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు 2 చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది సంయుక్తా హెగ్డే. అలాగే నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అంతగా ఆడలేదు దాంతో ఈ కన్నడ భామకు మళ్లీ తెలుగులో ఛాన్స్ లభించలేదు. తాజాగా కర్ణాటకలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. పలువురు హీరోయిన్ లు , హీరోలు డ్రగ్స్ వాడుతున్నారంటూ పుకార్లు రావడమే కాకుండా హీరోయిన్ రాగిణి ద్వివేది ని ఈ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ చేశారు. మరో హీరోయిన్ సంజన కు వారెంట్ ఇష్యు చేశారు పోలీసులు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి