దుబ్బాకలో టీఆర్ఎస్ కు గట్టి షాక్

0
48
trs party dubhaka

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  వచ్చే నెలలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది. టీఆర్ఎస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో చెరుకు ముత్యం రెడ్డి కి గట్టి పట్టుంది. పలుమార్లు శాసన సభ్యుడిగా , మంత్రిగా ప్రాతినిథ్యం వహించాడు కూడా. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు చెరుకు ముత్యం రెడ్డి. అయితే కొంతకాలం క్రితం చెరుకు ముత్యం రెడ్డి చనిపోయారు. చెరుకు ముత్యం రెడ్డి తనయుడే ఈ చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

ఇక దుబ్బాక ఉప ఎన్నిక విషయానికి వస్తే ……. సోలిపేట రామలింగారెడ్డి ఇటీవలే చనిపోయిన విషయం తెలిసిందే. సోలిపేట మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సోలిపేట మరణంతో తనకు టికెట్ వస్తుందని భావించాడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి. కానీ కేసీఆర్ మాత్రం సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించడంతో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదిపాడు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి దుబ్బాక లో మంచి పట్టు ఉండటంతో అతడికి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది దాంతో కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి.

ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ లో చేరడం అంటే రాజకీయ సమీకరణాలు నియోజకవర్గంలో మారినట్లే అని చెప్పాలి. అసలే ఒకవైపు బీజేపీ తరుపున రఘునందన్ రావు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే గులాబీకి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. అసలే కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీపై ప్రజల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ని వీడటం పట్ల గులాబీ అధినేత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. దుబ్బాక ఉప ఎన్నికకు నవంబర్ 3 న పోలింగ్ జరిపి  నవంబర్ 10 న ఫలితాలు వెల్లడించనున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి