ప్రభాస్ ఆది పురుష్ లో సూర్పనఖ  పాత్ర కావాలట ఈ భామకు

0
44
prabhas 22 movie
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ఆది పురుష్ అనే భారీ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మైథలాజికల్ సినిమా కావడంతో ప్రభాస్ శ్రీరాముడిగా ఎలా ఉంటాడో ? ఎలా మెప్పిస్తాడో ? అన్న చర్చ మొదలైంది. దాంతో కొంతమంది ప్రభాస్ వీరాభిమానులు ధైర్యం చేసి శ్రీరాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో ఊహించుకుంటూ డిజైన్ చేయడం అది బాగానే ఉండటంతో ప్రభాస్ గెటప్ బాగానే ఉంటుంది కానీ శ్రీరాముడిగా ఎలా నటిస్తాడో అన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చ పక్కన పెడితే ఇది రామాయణం కు చెందిన కథ కాబట్టి ఈ చిత్రంలో సూర్పనఖ పాత్ర కూడా ఉంటుంది.

ఇక ఆ సూర్పనఖ పాత్రలో మంచు లక్ష్మీ నటించడానికి ఆసక్తి చూపిస్తోంది. ప్రభాస్ చిత్రంలో ఎలాంటి పాత్ర నైనా చేయడానికి నేను సిద్ధం , సూర్పనఖ పాత్ర చేయాల్సి వస్తే అది తప్పకుండా నా అదృష్టంగా భావిస్తాను  ….. ….. ప్రభాస్ చిత్రంలో సూర్పనఖ పాత్ర చేస్తాను సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆది పురుష్ చిత్రంలో మంచు లక్ష్మీ కూడా నటిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ ఫీల్ అవ్వడం ఆమెను నేరుగా ప్రశ్నించడం అందుకు లక్ష్మీ ప్రసన్న కూడా ఓకే చేయడం బాగుంది అయితే ఆది పురుష్ లో మంచు లక్ష్మీ ప్రసన్నని తీసుకోవడం అన్నది దర్శకుడు ఓం రౌత్ మీద ఆధారపడి ఉంది.

మోహన్ బాబు వారసురాలిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మంచు లక్ష్మీ మంచి నటిగా గుర్తింపు పొందింది అయితే కమర్షియల్ గా విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు ని సైతం అందుకుంది. ఒకవైపు నటిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలని నిర్మించింది. 

మునుపటి వ్యాసంమహేష్ ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉంటాడో తెలుసా?
తదుపరి ఆర్టికల్నాని వి కోసం ఆ డేట్ ని ఎందుకు లాక్ చేసారో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి