శర్వానంద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా

0
45
sharwanandh friendship

యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే యువతి ఎవరో తెలుసా…… చరణ్ భార్య ఉపాసన కజిన్ ని. రాంచరణ్ , శర్వానంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. దాంతో తరచుగా చరణ్ తో కలుస్తుంటాడు శర్వానంద్. అలాగే చరణ్ – ఉపాసన ల కుటుంబంతో రెగ్యులర్ గా టచ్ లో ఉండటంతో ఉపాసన కజిన్ తో పరిచయం అయ్యిందట. మెల్లిగా ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇక ఈ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి  పెద్దలుగా చరణ్ – ఉపాసన వ్యవహరించారట.

ఇరు కుటుంబాలకు కూడా ఇష్టం అయ్యేలా చరణ్ – ఉపాసన వ్యవహరించారట. దాంతో ఇరు కుటుంబాలు కూడా ఒక అంగీకారానికి వచ్చాయట. త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లిపై ఒక అవగాహనకు రానున్నారట. ఈ చర్చలు ఫలవంతం అయ్యాక అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారట. అంటే ఈ పెళ్లి అయితే నిన్న మొన్నటి వరకు స్నేహితులు గా ఉన్న చరణ్ , శర్వానంద్ లు బంధువులు కానున్నారన్నమాట. ఉపాసన కుటుంబంలో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగాయి. అలాగే ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక ఉపాసన – చరణ్ లది కూడా లవ్ మ్యారేజ్ అన్న విషయం తెలిసిందే.

ఇక శర్వానంద్ విషయానికి వస్తే ……. తనకంటూ విభిన్నమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మిగతా హీరోల మాదిరిగా హడావుడిగా ఎక్కువగా సినిమాలు చేయకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల కొన్ని పరాజయాలు శర్వానంద్ ని ఇబ్బంది పడుతున్నాయి కెరీర్ పరంగా. దాంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు. శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం. వ్యవసాయ రంగంలో సరికొత్త చిత్రంగా ఈ శ్రీకారం చిత్రాన్ని భావిస్తున్నాడు శర్వానంద్. మరి ఆ సినిమా విడుదల అయితే కానీ తెలీదు ప్రేక్షకులకు నచ్చే సినిమానా ? లేదా ? అన్నది.

మునుపటి వ్యాసంస్కిన్ షోతో రెచ్చిపోతున్న నందిని రాయ్
తదుపరి ఆర్టికల్సమంత ఎందుకు ఏడ్చిందో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి