ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేస్తే శర్వానంద్ ఓకే చేసాడు

0
30
ak entertainments sarwanandh movie announced

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎట్టకేలకు మహాసముద్రం అధికారిక ప్రకటన వచ్చింది. ఆర్ ఎక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తెలుగు , తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు. గతకొంత కాలంగా ఈ సినిమా గురించి గుసగుసలు వినిపించేవి కానీ ఎట్టకేలకు ఈరోజు అధికారికంగా శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు అంటూ ప్రకటించారు. అలాగే ప్రతీ వారం కూడా ఏదో ఒక ప్రకటన ఇస్తూనే ఉంటామని స్పష్టం చేసారు దర్శక నిర్మాతలు.

కార్తికేయ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100 చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అజయ్ భూపతి. ఆ సినిమా 2018 లో విడుదల అయ్యింది. అయితే అంతటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా అజయ్ భూపతి రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. గత రెండేళ్లుగా మహాసముద్రం ప్రాజెక్ట్ నానుతూనే ఉంది పలువురు హీరోలు ఓకే అని తీరా రిజెక్ట్ చేసారు అలా ఒక్కో హీరో దగ్గరకు వెళ్తూ తిరస్కరణకు గురౌతూ ఇప్పుడు శర్వానంద్ చేతిలో పడింది. ఎట్టకేలకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఈ మహాసముద్రం చిత్రాన్ని చేస్తామని చెప్పి వెయిటింగ్ లో పెట్టి అన్నీ ఆలోచించి ముగ్గురు హీరోలు తిరస్కరించారు. ఇంతకీ మహాసముద్రం ని రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా ……. రవితేజ , అక్కినేని నాగచైతన్య , బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ ముగ్గురూ రిజెక్ట్ చేస్తే శర్వానంద్ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల అయితే కానీ తెలీదు శర్వానంద్ చేసింది తప్పా ? ఒప్పా ? అన్నది.

మునుపటి వ్యాసంమలైకా అరోరాకు కూడా కరోనా
తదుపరి ఆర్టికల్బిగ్ బాస్ 4 లో ట్రెండ్ సెట్టర్ గంగవ్వ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి