షర్మిల లవ్ స్టొరీ వెనుక కథ ఏంటో తెలుసా

0
52

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దుల కూతురు షర్మిల క్రిస్టియన్ మత ప్రచారకుడు అనిల్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి 1999 లో జరిగింది. అయితే ఇన్నాళ్లకు షర్మిల లవ్ స్టొరీ వెనుక ఉన్న కథ చెబుతోంది వై ఎస్ విజయమ్మ. వై ఎస్సార్ జయంతి సందర్భంగా నాలో …. నాతో వై ఎస్సార్ అనే పుస్తకం రాసింది విజయమ్మ. అందులో చాలా విషయాలను ఏమాత్రం మొహమాటం లేకుండా రాసి సంచలనం సృష్టించింది విజయమ్మ. అందులో తన కూతురు షర్మిల పెళ్లి విషయాలను ధైర్యంగా, చక్కగా ప్రస్తావించింది.షర్మిలకు మేనమామ అయిన చంద్ర ప్రతాప్ రెడ్డి తో పెళ్లి చేయాలని వై ఎస్సార్ నిర్ణయించారని కానీ మేనమామని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అనిల్ ని ప్రేమిస్తున్నానని తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి గట్టిగానే చెప్పిందట. అందుకు వై ఎస్ ఒప్పుకోలేదని, ఆమెకు నచ్చజెప్పి చంద్ర ప్రతాప్ రెడ్డితో పెళ్లి చేశాడని, అయితే ఆరు నెలల కాలంలోనే ఆ ఇద్దరికి విడాకులు ఇప్పించాల్సి వచ్చిందని తెలిపింది విజయమ్మ. ఇక విడాకులు అయ్యాక చంద్ర ప్రతాప్ రెడ్డి కి మరో పెళ్లి చేశారు. షర్మిల అమెరికా వెళ్లి అనిల్ ని అక్కడే పెళ్లి చేసుకుందట 1999లో. తన పెళ్లి విషయాన్ని వై ఎస్సార్ కు ఫోన్ లో చెప్పినప్పుడు షాక్ అయ్యాడట వై ఎస్సార్. కానీ ఆ తర్వాత తేరుకొని నీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయమ్మా అని అన్నాడట. కట్ చేస్తే ….. అనిల్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా నచ్చాడని, షర్మిల నిర్ణయం సరైందేనని సంతోషించాడని పేర్కొంది విజయమ్మ. తన కూతురు పెళ్లిళ్ల విషయాన్ని , అప్పట్లో జరిగిన విషయాలను చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం చేసిన విజయమ్మ నాలో నాతో వై ఎస్సార్ అనే పుస్తకం రాసి వై ఎస్ గొప్పతనం గురించి తెలియని వాళ్లకు తెలిసేలా చేస్తోంది.

మునుపటి వ్యాసంహమ్మయ్య కేసీఆర్ వచ్చిండు
తదుపరి ఆర్టికల్మహేష్ హ్యాండ్ ఇస్తే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి