కరీంనగర్ లో బిక్షాటన చేసిన షకలక శంకర్

0
124
shakalak shanker

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్హాస్య నటుడు షకలక శంకర్ కరీంనగర్ లో బిక్షాటన చేసాడు. షకలక శంకర్ ఏంటి ? కరీంనగర్ లో బిక్షాటన చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా?  తెలంగాణ రాష్ట్రంలోని కరీం నగర్ జిల్లాకు ఓ పని మీద వెళ్ళాడు షకలక శంకర్. అయితే అక్కడ కొంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియడంతో చలించిపోయాడు షకలక శంకర్ దాంతో వెంటనే వాళ్లకు తనకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలనీ భావించాడట అనుకున్నదే తడవుగా కరీం నగర్ లో బిక్షాటన చేసాడు.

తన మిత్రులతో కలిసి బిక్షాటన చేయడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది కరీం నగర్ లో. షకలక శంకర్ వచ్చాడు అన్న విషయం క్షణాల్లో జనాలకు తెలియడంతో పెద్ద ఎత్తున గుమికూడారు ప్రజలు దాంతో విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరగా పెద్ద ఎత్తున స్పందించిన ప్రజలు ఎవరికి తోచినంత మొత్తాన్ని ఇచ్చారు. ఈ సొమ్ము కొద్ది సమయంలోనే 90 వేలు అయ్యింది దాంతో తన దగ్గర ఉన్న పది వేలను కూడా కలిపి మొత్తంగా లక్ష రూపాయలను అందజేశాడు షకలక శంకర్. దాంతో అతడి మంచి మనసుకి ఉప్పొంగిపోయారు. కరోనా మహామ్మారి వల్ల దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి  ఉపాథి కరువయ్యింది.

చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు అలాగే వ్యాపారాలు కూడా అంతగా సాగడం లేదు ఇలాంటి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు షకలక శంకర్ అందుకోసం ఆయా ప్రాంతాల్లో బిక్షాటన చేయాలనీ అక్కడున్న వాళ్ళని కొంతవరకైనా ఆదుకోవాలని భావిస్తున్నాడట షకలక శంకర్. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ లో కూడా నటిస్తున్నాడు ఈ హాస్య నటుడు. అంతేకాదు హీరోగా కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

మునుపటి వ్యాసంభార్య విడాకులు ఇవ్వడంతో కన్నీళ్ల పర్యంతమైన డైరెక్టర్
తదుపరి ఆర్టికల్కత్తి కార్తీకని బెదిరించారట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి