వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి

0
28
sravani telugu serial artist suside

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  వేధింపులు ఎక్కువ కావడంతో తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. నిన్ననే నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొనగా నిన్న అర్ధరాత్రి టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవడంతో మరింత విషాదం నెలకొంది. సంఘటన వివరాలలోకి వెళితే ……. మౌనరాగం , మనసు మమత వంటి తెలుగు సీరియల్ లలో నటించిన కొండవీటి శ్రావణి నిన్న అర్ధరాత్రి మధురానగర్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. దాంతో పోలీసులు శ్రావణి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు.

కాకినాడ గొల్లప్రోలు గ్రామానికి చెందిన దేవరాజ్ రెడ్డి వేధింపుల వల్లే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు శ్రావణి తల్లిదండ్రులు. దేవరాజ్ రెడ్డి కొన్నాళ్ల క్రితం సీరియల్ నటి శ్రావణి కి టిక్ టాక్ లో పరిచయం అయ్యాడు. దాంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదరడంతో తల్లిదండ్రులు లేని అనాథని దేవరాజ్ నమ్మించడంతో కాకినాడలో ఉంటున్న దేవరాజ్ ని హైదరాబాద్ రప్పించి సీరియల్ లలో అవకాశం వచ్చేలా చేసింది. సీరియల్ ల కోసం తిరుగుతున్నా దేవరాజ్ ఎస్సార్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉండేవాడు. అయితే హాస్టల్ ఫుడ్ వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పడంతో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చింది శ్రావణి.

శ్రావణి చూపిన అభిమానాన్ని అవకాశంగా తీసుకున్న దేవరాజ్ ఆమె ఇంట్లో ఉంటూ ఆమె వ్యక్తిగత ఫోటోలను తీసి ఆమెని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఈ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది శ్రావణి. దాంతో బ్లాక్ మెయిల్ చేసి మా కూతురు మరణానికి కారణమైన దేవరాజ్ ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు శ్రావణి తల్లిదండ్రులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి