సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కెరీర్

0
37
hero raja shaker carrier

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్. 1985 లో వందేమాతరం చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు డాక్టర్ రాజశేఖర్. మొదటి చిత్రమే సూపర్ హిట్ అయ్యింది. వందేమాతరం చిత్రం తెలుగులో  రాజశేఖర్ కు మొదటి చిత్రం అయినప్పటికీ అంతకుముందే తమిళ్ లో నటించాడు. ఇక వందేమాతరం కంటే ముందే తెలుగులో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన ప్రతిఘటన విడుదల అయ్యింది. అది చాలా పెద్ద హిట్ అయ్యింది దాంతో వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు అందుకున్నాడు రాజశేఖర్. ఆ తర్వాత ఇక తెలుగునాట వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది.

వరుసగా అవకాశాలు వచ్చి పడటం , అవి సూపర్ హిట్ కావడంతో రాజశేఖర్ కు ఊహించని స్టార్ డం వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా చెలామణి అయ్యారు రాజశేఖర్. ముఖ్యంగా రాజశేఖర్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అంకుశం. పవర్ పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటనకు జేజేలు పలికారు ప్రేక్షక దేవుళ్ళు. యాంగ్రీ యంగ్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ ని అల్లరి ప్రియుడు అంటూ పాటలు పాడించడమే కాకుండా డ్యాన్స్ లు కూడా చేయించి సంచలన విజయాన్ని అందించాడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అయితే గత కొంత కాలంగా రాజశేఖర్ రేసులో లేకుండాపోయాడు కట్ చేస్తే గరుడ వేగ చిత్రంతో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడేమో వీరభద్రం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు. మొత్తంగా 35 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్ లో దాదాపు 90 చిత్రాల్లో నటించాడు రాజశేఖర్.

డాక్టర్ రాజశేఖర్ హిట్ చిత్రాల లిస్ట్ :

వందేమాతరం
ప్రతిఘటన
అరుణ కిరణం
చల్లని రామయ్య – చక్కని సీతమ్మ
తలంబ్రాలు
రేపటి పౌరులు
కాష్మోరా
ప్రజాస్వామ్యం
ఆహుతి
శ్రుతిలయలు
నవభారతం
న్యాయం కోసం
స్టేషన్ మాస్టర్
మమతల కోవెల
అంకుశం
మగాడు
అక్కమొగుడు
బలరామకృష్ణులు
అల్లరి ప్రియుడు
అంగరక్షకుడు
అన్న
ఘటోత్కచుడు
మా ఆయన బంగారం
సూర్యుడు
శివయ్య
మా అన్నయ్య
మనసున్న మారాజు
సింహరాశి
ఆయుధం
ఎవడైతే నాకేంటి
గోరింటాకు
గరుడ వేగ 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి