వెంకీ -తరుణ్ భాస్కర్ ల స్క్రిప్ట్ లాక్

0
37
Script lock of Venkatesh Tarun Bhaskar

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నారప్ప చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సినిమా కంప్లీట్ అయ్యాక పెళ్లిచూపులు డైరెక్టర్ దాస్యం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకుముందు లైన్ విని డెవలప్ చేయమని చెప్పగా తాజాగా పక్కా స్క్రిప్ట్ వినిపించాడట వెంకీకి. తరుణ్ నరేషన్ నచ్చిన వెంకీ వెంటనే వేసవిలోనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ఒప్పుకున్నారట. ఇక కథా చర్చల్లో వెంకీ తో పాటుగా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా పాల్గొన్నాడట! అతడికి కూడా నచ్చడంతో సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. హార్స్ రైడింగ్ నేపథ్యంలో తెలుగులో పెద్దగా చిత్రాలు రాలేదు దాంతో తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు ఇది విభిన్నమైన సినిమా అవుతుందని భావిస్తున్నారట. అలాగే యాక్షన్ కంటే ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందట దాంతో వెంకీ వెంటనే ఒప్పుకున్నాడట. పెళ్లిచూపులు తర్వాత తరుణ్ దర్శకత్వం వహించిన ఈనగరానికి ఏమైంది అంతగా ఆడలేదు అలాగే హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా అట్టర్ ప్లాప్ దాంతో తరుణ్ భాస్కర్ పై బాగానే ఒత్తిడి ఉండబోతోంది

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి