అమెరికా వెళ్లనున్న సర్కారు వారి పాట

0
123
Mahesh romance chance

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించనున్న చిత్రం ” సర్కారు వారి పాట ”. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసారు. అయితే గతకొద్ది రోజులుగా కీర్తి సురేష్ స్థానంలో మరో హీరోయిన్ ని వెతుకుతోంది చిత్ర బృందం అన్నట్లుగా ఊహాగానాలు చెలరేగాయి అయితే ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెట్టాలని భావించిన సర్కారు వారి పాట బృందం అలాంటిదేమి లేదని హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ అంటూ ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమా షెడ్యూల్ ఒకటి అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు అందుకే అమెరికా వెళ్ళడానికి వీసా తీసుకునే వాళ్లలో కీర్తి సురేష్ పేరు కూడా చేర్చారట దాంతో ఈ ఊహాగానాలకు తెరపడటం ఖాయం.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో ఫారిన్ లో షూటింగ్ అంటే మరింతగా భయపడటం ఖాయం. అయితే అమెరికాలో షూటింగ్ ఇప్పుడే కాదట. కరోనా కారణంగా అంత తొందరగా అనుమతులు లభించవు కాబట్టి ముందుగానే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు సర్కారు వారి పాట బృందం. మహేష్ బాబు ఈ చిత్రంలో మొట్ట మొదటిసారిగా ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్ బాబు లుక్ విడుదల కాగా ఆ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్యాంక్ లలో లోన్లు తీసుకొని వాటిని ఎగ్గొట్టే బడా బాబుల అంతు చూసే వ్యక్తిగా మహేష్ బాబు నటించనున్నాడు. యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా పుష్కలంగా ఉంటుందట ఈ సినిమాలో అందుకే మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాని పక్కన పెట్టి మరీ పరశురామ్ కు అవకాశం ఇచ్చాడు. పరశురామ్ నిన్న మొన్నటి వరకు చిన్న చిత్రాలు చేసుకుంటూ వస్తున్నాడు మొట్టమొదటి సరిగా స్టార్ హీరో తో సినిమా చేసే ఛాన్స్ లభించింది దాంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. 

మునుపటి వ్యాసంవిజయ్ దేవరకొండ తదుపరి సినిమా
తదుపరి ఆర్టికల్నటుడిగా 42 ఏళ్ళు పూర్తిచేసుకున్న మెగాస్టార్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి