`స‌ర్కారు వారి పాట` మోషన్ పోస్టర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌.

0
50
mahesh babu

సూపర్ స్టార్ కృష్ణ‌ పుట్టినరోజు సందర్భంగా మ‌హేశ్‌బాబు 27వ సినిమా  ‘సర్కారు వారి పాట` టైటిల్  ప్ర‌క‌టిస్తూ ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల‌ను మెస్మరైజ్ చేసిన విష‌యం తెలిసిందే.. ఆగ‌స్ట్ 9 సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు సందర్భంగా మహేష్ అభిమానులను హుషారెత్తించే `సర్కారు వారి పాట’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు నిర్మాత‌లు.

స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ప్రీ లుక్‌లో కనిపించిన మహేశ్‌.. ఇప్పుడు మోషన్ పోస్టర్‌లో ఆ కాయిన్ టాస్ చేస్తూ క‌నిపించారు. సర్కారు వారి పాట అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో థమన్ మ్యూజిక్ సూపర్ స్టార్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి.

ఈ సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు మాట్లాడుతూ  – “ నా  బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విషెస్ తెలుపుతున్న‌ ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. అభిమానులు ఆశిస్తున్న అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. `సర్కారు వారి పాట’ స్ట్రాంగ్ మెసేజ్‌తో  కూడిన ఒక  కంప్లీట్ ఎంటర్‌టైనర్“ అన్నారు.

దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ  – ” సూపర్ స్టార్ మహేశ్‌ గారిని డైరెక్ట్ చేయాలనే నా కల `స‌ర్కారు వారి పాట`  నెరవేరింది. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేయ‌డం ఆనందంగా ఉంది.” అన్నారు

మునుపటి వ్యాసంబ్రేకింగ్ న్యూస్: సుశాంత్ కేసు సీబీఐ కి అప్పగింత
తదుపరి ఆర్టికల్Rana – Miheeka Exclusive Wedding pics
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి