కెజిఫ్ చాప్టర్ 2 సంజయ్ దత్ అధీరా లుక్

0
51

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న చిత్రం కేజీఎఫ్ 2. ఈ చిత్రంలో అధీరా గా భయనకమైన విలన్ గా నటిస్తున్నాడు సంజయ్ దత్. ఈరోజు సంజయ్ దత్ 61 వ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అధీరా లుక్ విడుదల చేశారు. ఈ లుక్ లో సంజయ్ దత్ చాలా భయానకంగా ఉన్నాడు. అతి క్రూరమైన విలన్ గా కనిపిస్తున్నాడు సంజయ్ దత్. యష్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ పార్ట్ 2 రాబోతోంది. కొంత షూటింగ్ చేయాల్సి ఉంది.

కరోనా అడ్డు రావడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. కరోనా తగ్గిన తర్వాత బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. కేజీఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దాంతో ఈ రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సంజయ్ దత్ గెటప్ మరింత ఆసక్తికరంగా ఉండటంతో మరిన్ని అంచనాలు పెరిగేలా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సంజయ్ దత్ గెటప్ పై కాపీ ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా కేజీఎఫ్ 2 కూడా సంచలన విజయం సాధించే లాగే కనబడుతోంది. రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది ఈ చిత్రంలో.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి