కొత్త బిజినెస్ మొదలుపెట్టిన సమంత

0
31
samantha akkineni new business

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. ఇన్నాళ్లు ఫ్యాషన్ కు ఐకాన్ గా వ్యవహరించిన సమంత ఎట్టకేలకు ఫ్యాషన్ రంగంలోనే పెట్టుబడులు పెడుతోంది. పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కన్ఫర్మ్ చేసింది సమంత. సాకీ వరల్డ్ అనే పేరుతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెడుతోంది సమంత. ఆమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యువతని ఆకట్టుకునేలా అలాగే సామాన్య జనాలకు కూడా అందుబాటులో ఉండేలా ధరలు ఉంటాయని స్పష్టం చేసింది సమంత.

ఎన్నో నెలలుగా నేను ఈ ఫ్యాషన్ రంగంలోకి రావాలని కళలు కంటున్నాను అది ఇన్నాళ్లకు నెరవేరింది అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది సమంత. తరచుగా సమంత రకరకాల ఫ్యాషన్ లతో తన అభిరుచి ఏంటో చాటి చెబుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకున్న సమంత ఓ స్కూల్ కూడా నడిపిస్తోంది. అలాగే ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోకి దిగింది. ఇలా చేయడం ద్వారా కొంతమందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే …….. జాను అనే సినిమా తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు అయితే ఏవి అంగీకరించలేదు. కాకపోతే తమిళంలో మాత్రం రెండు సినిమాలను ఒప్పుకుంది అలాగే ” ది ఫ్యామిలీ మ్యాన్ ” అనే  వెబ్ సిరీస్ లో ఉగ్రవాదిగా నటిస్తోంది సమంత. మొదటిసారిగా నెగెటివ్ రోల్ పోషిస్తుండటంతో చాలా ఎగ్జైట్ గా ఉంది సమంత. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి