ఆ కష్టాలు పడలేక నెంబర్ మార్చిన సమంత

0
29
samanth akkineni

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్జొమాటో , స్విగ్గీ , ఆన్ లైన్ షాపింగ్ వాళ్ళ బాధలు పడలేక తన సెల్ ఫోన్ నెంబర్ ని మార్చేసింది హీరోయిన్ సమంత. అవును ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. భర్త అక్కినేని నాగచైతన్య తో కలిసి ఉంటున్న సమంత కొన్ని సమయాల్లో వంట చేసే ఓపిక లేని సమయాల్లో అలాగే వాళ్లకు కావాల్సిన కొన్ని రకాల వంటకాల కోసం తరచుగా స్విగ్గీ , జొమాటో వంటి వాటికీ ఆర్డర్ ఇస్తూ తెప్పించుకుంటుంటారట. అయితే అలా ఆర్డర్ చేయాలంటే అసలు అడ్రస్ తో పాటుగా అసలైన నెంబర్ ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి కావడంతో తన సెల్ నెంబర్ ఇచ్చి ఆర్డర్ చేస్తోంది సమంత.

అయితే ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ నెంబర్ సమంతది అని తెలుసుకున్న పలువురు తరచుగా సమంతకు ఫోన్ చేసి మా వద్ద మరిన్ని మంచి వంటకాలు ఉన్నాయని ఆర్డర్ ఇవ్వండి మేడం అంటూ ఫోన్లు చేస్తున్నారట. మొదట్లో ఇలాంటి ఫోన్లని లైట్ గా తీసుకుంది సమంత కానీ ఈ గోల ఎక్కువ కావడంతో ఇక భరించలేను అంటూ కొత్త నెంబర్ మార్చిందట.

స్విగ్గీ , జొమాటో మాత్రమే కాదు ఆన్ లైన్ షాపింగ్ కూడా సమంత చేస్తుంది. ఆన్ లైన్ లో షాపింగ్ అంటే అక్కడ కూడా సెల్ నెంబర్ ఇవ్వాల్సిందే. ఒకవేళ మరో నెంబర్ ఇచ్చినా అం లైన్ షాపింగ్ లో అమౌంట్ కట్టాలి కాబట్టి ఆ బిల్లుల ద్వారా కూడా తన నెంబర్ ని తెలుసుకొని మరీ ఫోన్ లు చేస్తున్నారట. మాకు తెలియకుండా మా నెంబర్ లను ఇతరులకు ఎలా ఇస్తున్నారు ? మా ప్రయివసీ ని ఎందుకు దెబ్బ తీస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సమంత. అందుకే ఈ బాధ పడలేక సెల్ నెంబర్ మార్చానని అంటోంది. తాజాగా ఈ భామ వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

మునుపటి వ్యాసంఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం కూల్చివేత
తదుపరి ఆర్టికల్భార్య విడాకులు ఇవ్వడంతో కన్నీళ్ల పర్యంతమైన డైరెక్టర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి