సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం

0
15
Salman khan nephew abdullah khan passes away

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (38) నిన్న రాత్రి మరణించాడు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా ఖాన్ ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మేనల్లుడి మృతితో సల్మాన్ ఖాన్ దుఃఖసాగరంలో మునిగాడు. మేనల్లుడిని తల్చుకుంటూ కన్నీళ్ల పర్యంతం కావడంతో అతడ్ని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

మేనల్లుడు అబ్దుల్లా అనే సల్మాన్ కు ఎనలేని ప్రేమ దాంతో అతడ్ని తన పక్కనే పెట్టుకునే వాడు. మేనల్లుడు మంచి బాడీ బిల్డర్ కావడంతో అతడితో కలిసి ఎక్సర్ సైజ్ చేస్తూ తీసిన వీడియోలను సోషల్ మీడియాలో చాలాసార్లు పెట్టాడు సల్మాన్ ఖాన్. ఇక పలు కార్యక్రమాలలో కూడా సల్మాన్ తో కలిసి పాల్గొన్నాడు అబ్దుల్లా ఖాన్. సల్మాన్ మేనళ్లుడు చనిపోయిన విషయం తెలియడంతో అతడికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు పలువురు ప్రముఖులు.

Salman Khan's nephew, Abdullah Khan, passes away from lung cancer

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి