ప్రభాస్ కు సారీ చెప్పిన మెగా మేనల్లుడు

0
68
cinema actore sai darma teja
ప్రభాస్ కు సారీ చెప్పిన మెగా మేనల్లుడు

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సారీ చెప్పాడు. ప్రభాస్ కు సాయి ధరమ్ తేజ్ సారీ చెప్పడం ఏంటి? సారీ చెబుతూ ఓ వీడియో విడుదల చేయడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? సాయిధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్ల బ్యాచ్ లర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు సాయిధరమ్ తేజ్. అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన ప్రభాస్ కు సారీ చెబుతున్నాడు. టాలీవుడ్ లో బ్యాచ్ లర్ లకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ లోంచి ఇటీవల నిఖిల్ , నితిన్ , రానా లెఫ్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ వంతు వచ్చింది అందుకే లెఫ్ట్ అయ్యే ముందు ప్రభాస్ కు సారీ చెబుతూ లెఫ్ట్ అయ్యాడట.

రేపు ఉదయం సాయిధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారట. ఆ ప్రకటన వస్తే కానీ అమ్మాయి ఎవరు ? ఎంగేజ్ మెంట్ ఎప్పుడు ? అలాగే పెళ్లి ఎప్పుడు అనేది తెలియనుంది. ఇటీవలే సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం సోలోబ్రతుకే సో బెటరు. ఇందులో పెళ్లి చేసుకోవద్దని , సోలోగా బ్యాచ్ లర్ గా బ్రతకడమే మంచిదని ఓ పాట కూడా పాడాడు సాయిధరమ్ తేజ్. అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే సోలో బ్రతుకుకు గుడ్ బై చెప్పేస్తూ పెళ్లికి సిద్ధం అవుతున్నాడు. టాలీవుడ్ లో ఇటీవల పలువురు హీరోలు పెళ్లి చేసుకోగా నిహారిక సైతం పెళ్లికి సిద్ధమైంది. సరిగ్గా ఇదే సమయంలో మెగా మేనల్లుడు కూడా పెళ్లికి రెడీ అయ్యాడు.

ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ? అనేది మరోసారి చర్చకు రావడం ఖాయం. ఎందుకంటే టాలీవుడ్ లో బ్యాచ్ లర్ హీరోలు అందరూ పెళ్లి చేసుకోగా మిగిలిన కొంతమంది కూడా పెళ్లికి సిద్ధం అవుతున్నారు. దాంతో టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ ? అన్న చర్చ మరోసారి సాగడం ఖాయం.

మునుపటి వ్యాసంచంద్రబాబుని ఘోరంగా అవమానించిన మోహన్ బాబు
తదుపరి ఆర్టికల్షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న రాజమౌళి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి