పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన సాహో డైరెక్టర్

0
52
sujeeth DIRECTOR

సాహో డైరెక్టర్ సుజీత్ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో డాక్టర్ ప్రవల్లిక ని వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడు. దాంతో త్వరలోనే పెళ్లి జరుగుతుందని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆగస్ట్ 2 న సీక్రెట్ గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు. సుజీత్ – ప్రవల్లిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా విలయతాండవం చేస్తోంది కాబట్టి తక్కువ మందితోనే పెళ్లి చేసుకోవాలి కానీ మరీ సమాచారం ఇవ్వకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అంటూ షాక్ అవుతున్నారు జనాలు.

రన్ రాజా రన్  చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజీత్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న సుజీత్ కు ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే సాహో హిట్ కాలేదు కానీ ప్రభాస్ కున్న స్టార్ డంతో భారీ వసూళ్లు సాధించింది. ఇక ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవితో మలయాళ చిత్రం లూసిఫర్ ని రీమేక్ చేసే అవకాశం వచ్చింది. ఇక సుజీత్ భార్య ప్రవల్లిక విషయానికి వస్తే తాను ఓ డాక్టర్ అయినప్పటికీ టిక్ టాక్ లో చాలా ఫేమస్ అంట. దాంతో డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి సుజీత్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తోందట. ఇక రహస్య వివాహం గురించి సుజీత్ నోరు విప్పితే కానీ తెలీదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి