సంజయ్ దత్ కు క్యాన్సర్ ?

0
48
sanjay dutt

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ సోకినట్లు సంజయ్ దత్ కు అత్యంత సన్నిహితుడు తెలిపారు. ఇటీవల శ్వాసకోశ వ్యాధితో సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాసకోశ వ్యాధి అనగానే ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేసారు. అయితే కరోనా లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు డాక్టర్లు. ఆ తర్వాత ఊపిరి తిత్తులను పరీక్షించగా క్యాన్సర్ సోకినట్లు తేలింది దాంతో మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లాల్సిందిగా డాక్టర్లు సలహా ఇచ్చారట దాంతో అమెరికా ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాడు సంజయ్ దత్.

తమ అభిమాన హీరో ఆసుపత్రిలో చేరాడు అని తెలియగానే వేలాది మంది ఆసుపత్రికి తరలివచ్చారు. అలాగే ఆయన యోగక్షేమాల గురించి వాకబు చేస్తుండటంతో ఎట్టకేలకు సంజయ్ దత్ తన ఆరోగ్య విషయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మీ అందరి ఆదరాభిమానాలు వల్ల బాగానే ఉన్నానని , అయితే కొద్ది రోజులు నటన నుండి విరామం తీసుకుంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో మళ్ళీ తిరిగి వస్తా అంటూ ట్వీట్ చేసాడు సంజయ్ దత్. 2000 దశకంలో బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ప్రభంజనం సృష్టించాడు సంజయ్ దత్ నాయక్ నహీ ఖల్ నాయక్ హు మై అంటూ. 

మునుపటి వ్యాసంకార్లను అమ్ముకున్న రేణు దేశాయ్
తదుపరి ఆర్టికల్డబుల్ గేమ్ ఆడుతున్న  వర్మ
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి