పుకార్లు ఖండించిన రాంగోపాల్ వర్మ

0
56
rgv dirctor

తన ఆరోగ్యం పై పుకార్లు షికార్లు చేస్తుండటంతో రాంగోపాల్ వర్మ ధీటైన సమాధానం ఇచ్చాడు. ఎక్సర్ సైజ్ చేస్తూ నేను ఆరోగ్యంగానే ఉన్నాను కావాలంటే చూడండి అంటూ ఓ వీడియో ను పోస్ట్ చేసాడు. నా ఆరోగ్యం పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఓ వెబ్ సైట్ ని ఉదహరిస్తూ పోస్ట్ చేసాడు. పరోక్షంగా సదరు వెబ్ సైట్ పై చురకలు అంటించాడు వర్మ. ఓ మీడియాలో వర్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు అని ప్రచారం చేయడంతో నేను ఫిట్ గా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చారు.

అంతేనా లాక్ డౌన్ సమయంలో ఎవరూ ఊహించని విధంగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా మర్డర్ , థ్రిల్  సినిమాలతో పాటుగా డేంజరస్ అనే లెస్బియన్ల సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలను తన ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల చేయనున్నాడు. హైదరాబాద్ లో కరోనా విలయతాండవం చేస్తుండటంతో వర్మకు కూడా అనారోగ్యం సోకిందని , వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ప్రచారం సాగింది. కరోనా ఒకవైపు విజృంభిస్తుండటంతో అందరూ భయపడుతున్నారు. కానీ వర్మ మాత్రం కరోనాకు భయపడకుండా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు.

మునుపటి వ్యాసంఎన్టీఆర్ వచ్చినా టీడీపీని కాపాడలేడంటున్న మంత్రి
తదుపరి ఆర్టికల్హీట్ పెంచుతున్న సురేఖా వాణి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి