పుకార్లని ఖండించిన లారెన్స్

0
59
LARENCE

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాగా ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారు. పి. వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి 2 రూపొందనుంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటుగా రాఘవ లారెన్స్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పలువురు భామలకు తీసుకుంటున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సిమ్రాన్ అని , కియరా అద్వానీ అని , జ్యోతిక అని అయితే ఇవన్నీ పుకార్లు మాత్రమే అని ఖండించాడు రాఘవ లారెన్స్.

ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నాం , కరోనా తగ్గిన తర్వాత మాత్రమే హీరోయిన్ లుగా ఎవరిని తీసుకోవాలి అన్నది దర్శక నిర్మాతలు డిసైడ్ చేస్తారు. అలాగే స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. అది పూర్తయ్యాకే హీరోయిన్ ల సంగతి అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు చేయకండి , అలాగే నమ్మకండి అంటూ సెలవిచ్చాడు రాఘవ లారెన్స్. దెయ్యాలు , భూతాలు చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు లారెన్స్. అలాంటి లారెన్స్ చంద్రముఖి2 లో నటిస్తున్నాడు అంటే కాస్త అంచనాలు పెరగడం ఖాయం మరి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి