పుకార్లను ఖండించిన డైరెక్టర్ క్రిష్

0
46
krish

దర్శకులు క్రిష్ తన సినిమా ఆగిపోయిందనే వార్తలను ఖండించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ నటించిన గజ దొంగ అనే టైటిల్ కూడా వినబడుతోంది. ఆ టైటిల్ లను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా ఆగిపోయింది. అంతేకాదు ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది అందుకే క్రిష్ మరో సినిమా ఒప్పుకున్నాడు అంటూ ఊహాగానాలు చెలరేగాయి.

ఈ వార్తలు దర్శకులు క్రిష్ చెవిన పడటంతో ఎట్టకేలకు స్పందించాడు …….. వివరణ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో నేను చేయబోయే సినిమా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు నిరాధారం. అలాంటి వార్తలను ఖండిస్తున్నాను. మా సినిమాలో ఎలాంటి మార్పులు లేవు యధావిధిగా మా కాంబినేషన్ లో సినిమా వస్తోందని కాకపోతే వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కు సంబందించిన మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది కాబట్టి వకీల్ సాబ్ ని పవన్ కంప్లీట్ చేసేలోపు నేను వైష్ణవ తేజ్ సినిమా కంప్లీట్ చేయనున్నాను. వైష్ణవ తేజ్ సినిమా సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అవుతుంది.

అది పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ నా సినిమాకే ఇచ్చాడు. నా సినిమా కంప్లీట్ చేశాకే మరో సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్ ఇందులో ఎలాంటి మార్పు లేదు అంటూ వివరణ ఇచ్చాడు క్రిష్. ఇలా వివరణ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నిజంగానే పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా ఆగిపోయింది అంటూ ఇంకా ఊహాగానాలు చెలరేగేవి ఎందుకంటే వైష్ణవ్ తేజ్ సినిమా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ ఊహాగానాలు వచ్చాయి . మొత్తానికి క్రిష్ కరోనా సమయాన్ని బాగానే ఉపయోగించుకున్నాడన్న మాట. 

మునుపటి వ్యాసంకాపాడండి అంటూ వేడుకుంటున్న సీనియర్ నటి
తదుపరి ఆర్టికల్వెంటిలేటర్ పై ఎస్పీ బాలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి