రూమర్స్ ని ఖండించిన అమితాబ్

0
53

ఆల్ ఇండియా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకడంతో ముంబయి లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అమితాబ్ కు కరోనా తగ్గిందని , తాజాగా చేసిన టెస్ట్ లో నెగెటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అమితాబ్ చెవిన పడటంతో స్పందించాడు. నాకు నెగెటివ్ వచ్చిందన్న వార్తలు నిరాధారమని , అసలు విషయం తెలుసుకోకుండా నాకు కరోనా తగ్గిందని ఎలా రాస్తారు అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమితాబ్ .

10 రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ కు అలాగే అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. దాంతో అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమితాబ్ తో పాటుగా ఐశ్వర్యారాయ్ , ఆద్య లకు కూడా కరోనా సోకింది. దాంతో వాళ్ళు కూడా చికిత్స పొందుతున్నారు. అమితాబ్ వయసు 77 ఏళ్ళు దాటాయి. దాంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు డాక్టర్లు. అమితాబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.

మునుపటి వ్యాసంకేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
తదుపరి ఆర్టికల్“వాడివాసల్‌` మూవీ సూర్య హీరోగా ఫ‌స్ట్‌లుక్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి