రూమర్స్ ని ఖండించిన యంగ్ హీరో

0
46
TMN logo
TMN logo

 

హీరో తరుణ్ తనపై వస్తున్న రూమర్స్ ని ఖండించాడు. బిగ్ బాస్ 4 లో నేను పాల్గొంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే పలువురు నాకు ఫోన్ చేసి ఇది నిజమా అని అడుగుతున్నారు అందుకే అందరికీ క్లారిటీ గా చెప్పాలని ఓ ప్రకటన విడుదల చేస్తున్నానని తెలిపాడు తరుణ్. బిగ్ బాస్ 4 సీజన్ లో నేను పాల్గొనడం లేదు , అలాగే బిగ్ బాస్ 4 సీజన్ షోలో పాల్గొనాలని  నాకు ఎలాంటి ఆసక్తి కూడా లేదు. దయచేసి మళ్లీ మళ్లీ నా పేరు రాయకండి అని అంటున్నాడు తరుణ్.

2000 దశకంలో తరుణ్ మంచి స్టార్ గా ఎదిగాడు. యంగ్ హీరోగా మంచి పీక్స్ లో ఉండేది అతడి కెరీర్ . కానీ మంచి స్టార్ డం ఉండగానే సినిమాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో కెరీర్ మందగించిపోయింది. ప్రస్తుతం తరుణ్ చేతిలో సినిమాలు లేవు. ఇక కరోనా వల్ల సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. ఇదే సమయంలో బిగ్ బాస్ 4 సీజన్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తరుణ్ పేరు నానడంతో ఖండించాడు.

మునుపటి వ్యాసంకేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేసిన ఫైర్ బ్రాండ్
తదుపరి ఆర్టికల్పవర్ స్టార్ ట్రైలర్ లీక్ : వర్మ షాక్ తిన్నాడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి