దుబ్బాక నుండి పోటీ చేయనున్న మాజీ ఎంపీ

0
67
trs car

దుబ్బాక నుండి పోటీ చేయనున్న కవిత ?

నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే దుబ్బాక శాసన సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. సోలిపేట మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుందని అప్పుడే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కవిత అభిమానులు , టీఆర్ఎస్ శ్రేణులు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిపడుతున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి చనిపోయి పట్టుమని వారం రోజులు కాలేదు అప్పుడే ఇలా ప్రచారం చేయడం ఏంటి? అయినా టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెంటే నిలిచిన రామలింగారెడ్డి కుటుంబం లోనే ఎవరికైనా ఒకరికి టికెట్ ఇవ్వాలి కానీ కవిత కు ఇవ్వడం ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు పలువురు.

కవిత నిజామాబాద్ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయింది. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్థానం నుండి ఎం ఎల్ సి గా పోటీ చేయాలని భావించింది. అందుకు తగ్గట్లుగా కేసీఆర్ కవితని ఎం ఎల్ సి అభ్యర్థి గా ప్రకటించారు కూడా కానీ ఎన్నికలు జరగలేదు ఎందుకంటే కరోనా విలయతాండవం వల్ల. ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఈలోగా దుబ్బాక స్థానం ఖాళీ కావడంతో ప్రత్యక్ష ఎన్నికల్లోనే తలపడాలని భావిస్తోందట కవిత. అందుకే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోలిపేట రామలింగారెడ్డి అనుచరులు. నాలుగుసార్లు ఎం ఎల్ ఏ గా గెలిచినా , కేసీఆర్ వెన్నంటి ఉన్నప్పటికీ మంత్రి పదవి దక్కలేదు , ఇప్పుడేమో అన్న ప్రాణం పోయింది అని బాధపడుతుంటే అన్న కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వకుండా కవిత ని ఇక్కడ నుండి పోటీ చేయించాలని చూడటం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రామలింగారెడ్డి అనుచరులు.

మునుపటి వ్యాసంఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ల చిత్రానికి బడ్జెట్ ఎంతో తెలుసా
తదుపరి ఆర్టికల్Naina Ganguly “Johar” movie Actress
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి