ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ అదరహో

0
21
RRR Movie motion poster out

ఈరోజు ఉగాది కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ చిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ నిజంగానే అదిరిపోయేలా ఉంది ! ఆ పోస్టర్ ని చూసి అదరహో అదరహా అంటున్నారు నందమూరి , మెగా ఫ్యాన్స్.ఇక ఆర్ ఆర్ ఆర్ ఫుల్ నేమ్ కూడా రివీల్ చేసాడు జక్కన్న. తెలుగులో ఆర్ ఆర్ ఆర్ అంటే ఏంటో తెలుసా ……. రౌద్రం ,రణం , రుధిరం అనే అర్ధం ఇచ్చాడు జక్కన్న.

ఎన్టీఆర్ , చరణ్ లు ఇద్దరు కూడా పరుగెడుతూ వస్తున్న మోషన్ పోస్టర్ కేక పెట్టించేలా ఉంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చరణ్ ఫ్యాన్స్ కు ఇది నిజమైన ఉగాది అనే చెప్పాలి. అసలే కరోనా భయంతో వణికిపోతున్న సినిమా అభిమానులకు కూడా ఇది పండగే అని చెప్పాలి. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జనవరి 8 న విడుదల చేయాలనీ అనుకుంటున్నాడు జక్కన్న. అయితే ఈరోజు విడుదల అయిన మోషన్ పోస్టర్ లో మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు మరి.

 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి