ఆ స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రమే నటిస్తానంటున్న రోజా

0
46
roja

 

సీనియర్ హీరోయిన్ రోజా టాలీవుడ్ లో మళ్ళీ నటించాలని ఆశపడుతోంది అయితే అందరు హీరోల చిత్రాల్లో నటించనని తేల్చిచెప్పింది. కేవలం చిరంజీవి , నాగార్జున చిత్రాల్లో మాత్రమే నటిస్తానని కుండబద్దలు కొట్టింది రోజా. ఆంధ్రప్రదేశ్ నగరి నియోజకవర్గం ఎం ఎల్ ఏ గా రెండోసారి ఎన్నిక అయ్యింది రోజా. జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించింది అయితే రోజా కు మంత్రి పదవి ఇవ్వలేదు జగన్ దాంతో కొన్నాళ్ళు అలిగింది. కట్ చేస్తే కేబినెట్ ర్యాంక్ ఉన్న ఏపీఐఐసి చైర్మన్ పదవిని కట్టబెట్టాడు.

ఇక 2013 నుండి జబర్దస్త్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది రోజా. జబర్దస్త్ తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది రోజా. ఒకవైపు రాజకీయాలు , మరోవైపు జబర్దస్త్ వ్యవహారాలు దాంతో సినిమాల్లో నటించలేదు గత ఆరేళ్లుగా. ఇక ఇప్పుడు వీలు చేసుకొని తప్పకుండా నటించడానికి సుముఖత వ్యక్తం చేస్తోంది రోజా. అయితే తనకు మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తానని అంది అందులో చిరంజీవి , నాగార్జున చిత్రాలు మాత్రమే అంగీకరిస్తానని కూడా స్పష్టం చేసింది.

అంటే టాలీవుడ్ లో చిరంజీవి , నాగార్జున మాత్రమే కాకుండా చాలామంది హీరోలు ఉన్నారు ముఖ్యంగా బాలకృష్ణ సరసన రోజా ఎక్కువ చిత్రాల్లో నటించింది అలాగే బాలయ్య – రోజా లది సూపర్ హిట్ కాంబినేషన్. అయినప్పటికీ బాలయ్య పేరు ఎక్కడా ప్రస్తావించకుండా చిరంజీవి – నాగార్జున చిత్రాల్లో మాత్రమే నటిస్తాను అని చెప్పడం అంటే బాలయ్య చిత్రాల్లో నటించను అని చెప్పినట్లే కదా ! రాజకీయంగా బాలయ్య తెలుగుదేశం పార్టీ అయితే రోజా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది.

మునుపటి వ్యాసంపెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన హీరోయిన్
తదుపరి ఆర్టికల్ఆర్ ఆర్ ఆర్ నుండి ఆ హీరోయిన్ తప్పుకుందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి