జగన్ నిర్ణయంతో షాక్ అయిన రోజా

0
47
cm jagan

టాలీవుడ్ మూవీ న్యూస్, విజయవాడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో షాక్ అయ్యింది నగరి ఎం ఎల్ ఏ రోజా. జగన్ తీసుకున్న నిర్ణయంతో రోజా షాక్ అవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? రోజా నగరి అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే నియోజకవర్గంలో రోజా ప్రత్యర్థి వర్గం ఉంది. రోజా కు ప్రత్యర్థి వర్గం నేత అయిన కేజే కుమార్ కు అస్సలు పడదు. ఒకే పార్టీలో కొనసాగుతున్నారు ఈ ఇద్దరూ పైగా ఒకే నియోజకవర్గం అయినప్పటికీ రోజా అంటే కేజే కుమార్ కుపడదు దాంతో ఆమెకు వ్యతిరేకంగా వర్గాన్ని కూడగట్టాడు కేజే కుమార్.

ఇక రోజా కు కూడా కేజే కుమార్ అంటే అస్సలు పడదు , నగరి ఎం ఎల్ ఏ ని నేను కాబట్టి నా కనుసన్నల్లోనే నియోజకవర్గం ఉండాలని భావిస్తోంది. అయితే ఆమధ్య రోజా తన నియోజకవర్గంలోని ఓ గ్రామపంచాయితీ ప్రారంభోత్సవానికి వస్తే ఆమె రాకుండా అడ్డుపడటమే కాకుండా దాడికి కూడా పాల్పడ్డారు. దాంతో కేజే కుమార్ పట్ల మరింత ఆగ్రహంగా ఉంది రోజా. అయితే తన ప్రత్యర్థి వర్గమైన కేజే కుమార్ భార్యకు రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్మన్  పదవి కట్టబెట్టాడు జగన్.

తన నియోజకవర్గంలో తన ప్రత్యర్థికి కీలక కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంతో జగన్ నిర్ణయంతో షాక్ అయ్యింది రోజా. కేజే కుమార్ భార్యకు చైర్మన్ పదవి ఇవ్వడం అంటే తనని అవమానించినట్లే అని భావిస్తున్నారట రోజా అనుయాయులు. అయితే రోజా తో పాటుగా కేజే కుమార్ కూడా వైసీపీ లో కీలక నేతగా ఉన్నాడు కాబట్టి అతడు పార్టీ కోసం కష్టపడినందుకు గాను ఈ పదవి ఇచ్చారు అందులో రోజాని తక్కువ చేసిందేమి లేదని అంటున్నారు వైసీపీ నాయకులు. 

మునుపటి వ్యాసంనిశ్శబ్దం రివ్యూ
తదుపరి ఆర్టికల్అల్లు అర్జున్ చిత్రంలో ఈ హీరో నటించడం లేదట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి