వైరల్ అవుతున్న రోజా కూతురు ఫోటోలు 

0
30
roja family

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఫైర్ బ్రాండ్ రోజా గురించి కొత్తగా చెప్పేదేముంది. హీరోయిన్ గా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించి సంచలనం సృష్టించింది. ఇక గతకొంత కాలంగా రాజకీయ నాయకురాలిగా కూడా రాణిస్తోంది. మొదట  తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన రోజా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది. చిత్తూర్ జిల్లా నగరి నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలిగా రెండోసారి కూడా గెలుపొందింది. ఒకవైపు రాజకీయ నాయకురాలిగా కొనసాగుతూనే మరోవైపు జబర్దస్త్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

రోజా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది రోజా. సెల్వమణి – రోజా లకు ఇద్దరు సంతానం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది కాగా అబ్బాయి చిన్నవాడు. రోజా కూతురు పేరు అన్షు మాలిక. ప్రస్తుతం రోజా కూతురు అన్షు మాలిక సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇటీవలే రోజా కూతురు అన్షు మాలిక 17 వ పుట్టినరోజు వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో రోజా కూతురు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

రోజా లాగే అన్షు మాలిక అందంగా , చూడముచ్చటగా ఉండటంతో అన్షు కూడా హీరోయిన్ అవుతుందా ? సినిమాల్లోకి వస్తుందా ? అన్న చర్చ అప్పుడే మొదలయింది. అయితే రోజా మనసులో ఏముందో అలాగే అన్షు మాలిక మనసులో ఏముందో ఇంకా బయటపడలేదు. అయితే రోజా తన కొడుకుని మాత్రం హీరోగా చూసుకోవాలని ఆశపడుతోంది. అన్షు మాలిక సినిమాల్లోకి వస్తుందా ? తల్లి లాగా ప్రేక్షకులను అలరిస్తుందా ? అన్నది కాలమే నిర్ణయించాలి. మొత్తానికి రోజా కూతురు అన్షు మాత్రం అప్పుడే అభిమానులను సొంతం చేసుకుంటోంది తన అందంతో. 

2 Attachments
మునుపటి వ్యాసంప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ తనయుడు మృతి
తదుపరి ఆర్టికల్స్కాలర్ షిప్ ఇస్తానంటున్న సోనూ సూద్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి