డేంజరస్ ఫస్ట్ లుక్ తో ప్రకంపనలు సృష్టిస్తున్న వర్మ

0
60
dangerous rgv movie

 

rhv dangerouse

డేంజరస్ అనే సినిమాతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు వివాదాస్పద వ్యక్తి రాంగోపాల్ వర్మ. అప్సర రాణి , నైనా గంగూలీ ఇద్దరు భామలు కూడా ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా విడుదల చేసిన డేంజరస్ ఫస్ట్ లుక్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నైనా గంగూలీ – అప్సర రాణి ల లిప్ లాక్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు లెస్బియన్ల  లిప్ లాక్ పోస్టర్ సంచలనం సృష్టిస్తుండగా గాయలతోనే లిప్ లాక్ చేసుకుంటూ మరింత భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ ఇద్దరు లెస్బియన్ల ఎఫైర్ చాలామంది పోలీసులను గ్యాంగ్ స్టర్ లను అంతం చేసింది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు వర్మ.

అసలే కరోనా ఆపై షూటింగ్ లంటే భయపడుతున్నారు పలువురు. ఇలాంటి సమయంలో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు వర్మ. ఇప్పటికే నగ్నం, పవర్ స్టార్ చిత్రాలను తీయడమే కాకుండా తన పేరిట ఓ వరల్డ్ థియేటర్ అని పెట్టి దాంట్లో సినిమాలు విడుదల చేస్తున్నాడు. ఇక ఇప్పుడేమో మర్డర్ , థ్రిల్లర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవి కాకుండా డేంజరస్ అనే సినిమా రూపకల్పనలో ఉన్నాడు వర్మ. ఈ డేంజరస్ సినిమా కూడా ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది.

మునుపటి వ్యాసంRana – Miheeka Exclusive Wedding pics
తదుపరి ఆర్టికల్మిహీక బజాజ్ కట్టుకున్న లెహేంగా ఎన్ని లక్షలో తెలుసా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి