బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి

0
21
Revanth Reddy released on bail

మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఎట్టకేలకు 13 రోజుల తర్వాత చర్లపల్లి జైలు నుండి బెయిల్ పై విడుదల అయ్యాడు. నిన్న సాయంత్రం బెయిల్ పై విడుదలైన రేవంత్ రెడ్డి తనకు మద్దతుగా వచ్చిన నాయకులను , కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ , కేటీఆర్ లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూడా మండిపడ్డాడు . నన్ను చర్లపల్లి జైలు లో పెడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ పరామర్శించడానికి రాలేదని అది నా కోసం చేసిన పని కాదని కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా చెప్పిన ఆదేశాల మేరకే పని చేసానని , నా చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉంటానని సవాల్ చేసాడు.

కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారని మనమంతా ఒక్కటిగా నిలబడితే తప్పకుండా కేసీఆర్ ని గద్దె దింపగలమని కానీ మనమంతా ఒక్కటి కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని గద్దె దించేంత వరకు నేను నిద్ర పోయేది లేదని అంటున్నాడు రేవంత్ రెడ్డి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి