రైతుల సమస్యలపై సినిమా తీయనున్న రేణు దేశాయ్

0
23
renu deasi making movie on farmers problems

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్నటి రేణు దేశాయ్ మెగా ఫోన్ చేతబట్టి రైతుల సమస్యలపై సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ సినిమా కోసం ప్రజాకవి గోరెటి వెంకన్న తో పాటలు కూడా రాయిస్తోంది. తాజాగా గోరెటి వెంకన్న ఇంటికి వెళ్లిన రేణు దేశాయ్ అతడికి తన సినిమాలోని సన్నివేశాలను అలాగే కథని వివరించి పాటలు రాయమని కోరింది. రేణు దేశాయ్ కోరిక మేరకు పాటలు అందిస్తున్నాడు గోరెటి వెంకన్న. తన సినిమాకు గోరెటి వెంకన్న చేత పాటలు రాయించడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది రేణు దేశాయ్.

ఆమధ్య కాలంలో రైతుల మీద వాళ్ళ సమస్యల మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించింది రేణు దేశాయ్. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా సినిమా తీయడానికి సిద్ధమైపోయింది. ఇంతకుముందు మరాఠీలో ఓ సినిమాకు దర్శకత్వం వహించింది రేణు దేశాయ్ కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమాకు రేణు దేశాయ్ నిర్మాత కావడం కూడా విశేషం. ఇక ఇప్పుడు కూడా దర్శకురాలిగా ప్రయోగం చేస్తోంది కాబట్టి తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరి ఈ సినిమాతో రేణు దేశాయ్ సత్తా చాటుతుందేమో చూడాలి.

రేణు దేశాయ్ గతకొంత కాలంగా హైదరాబాద్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఓ ఖరీదైన విల్లా కొనుక్కుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటోంది. అడపా దడపా పూణే వెళ్లి వస్తోంది. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం రేణు దేశాయ్ ని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి