వెబ్ సిరీస్ లో నటిస్తున్న రేణు దేశాయ్

0
37
renu desai web series

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ నటనకు శ్రీకారం చుడుతోంది. ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సంతకం చేసింది అంతేకాదు ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా వెల్లడించింది. కృష్ణ మామిడాల అనే దర్శకుడి దర్శకత్వంలో వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించాను , ఈ వెబ్ సిరీస్ వచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనుంది అందుకే మీ ఆశీర్వాదం కావాలి అంటూ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ఒకవైపు నటిగా కొనసాగుతూనే మరోవైపు రైతుల సమస్యల మీద ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తోంది.


పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రేణు దేశాయ్. ఆ సినిమా హిట్ కావడంతో మళ్ళీ పవన్ కళ్యాణ్ సరసన జానీ అనే సినిమాలో నటించింది అయితే బద్రి సినిమాలో నటిస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది దాంతో ఇతర హీరోల సరసన నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ వాటిని అంగీకరించలేదు. ఆ తర్వాత పవన్ తో సహజీవనం చేస్తూ 2009 లో పెళ్లి చేసుకుంది. అయితే ఆ కాపురం మూన్నాళ్ళ ముచ్చటగానే అయ్యింది 2013 లో రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ లు విడిపోయారు.

ఇక అప్పటి నుండి ఎక్కువగా పూణే లో తన ఇద్దరు పిలల్లతో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ ఇటీవల హైదరాబాద్ కు మకాం మార్చింది. ఈ దశలోనే ఓ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ లభించింది దాంతో మళ్ళీ నటనకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు ఈ సంతోషకరమైన విషయాన్నీ తన అభిమానులకు చెప్పాలనుకొని సోషల్ మీడియాలో ప్రకటించింది. మళ్ళీ నటనకు శ్రీకారం చుట్టిందంటే తప్పకుండా సినిమాల్లో కూడా నటించడం ఖాయం అన్నమాటే. 

మునుపటి వ్యాసంభట్టికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన తలసాని
తదుపరి ఆర్టికల్ఓటీటీ ని కూడా చంపేస్తారా ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి