కార్లను అమ్ముకున్న రేణు దేశాయ్

0
51
renu desai

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనకున్న రెండు కార్లను కూడా అమ్ముకుంది. పైగా ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది సోషల్ మీడియాలో. దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతు అయ్యింది. అయ్యో ! రెండు కార్లను అమ్ముకుందంటే ఆమె ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతోందా ? అని అనుకునేరు కాదు సుమా ! పెట్రోల్ , డీజిల్ కార్ల వల్ల పర్యావరణానికి చాలా ముప్పు ఉందన్న విషయాన్ని తెలుసుకుందట దాంతో పర్యావరణాన్ని రక్షించండి అని ఇతరులకు చెప్పే బదులుగా తానె ఆ పని చేయాలనీ భావించి తన ఖరీదైన రెండు కార్లను కూడా అమ్మేసింది. అయితే రేణు దేశాయ్ అలాగే ఆమె పిల్లలు తిరగడానికి ఎలక్ట్రిక్ వెహికిల్ కొనుకుంది.

పెట్రోల్ , డీజిల్ కార్ల వల్ల వాతావరణం దెబ్బతింటోంది కాబట్టి ఆ కార్లను వాడొద్దు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే వాడాలి అని చెప్పడానికి ఇలా చేసింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చాక కొంతకాలం పూణేలో ఉన్న రేణు దేశాయ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ విల్లా లో ఉంటోంది రేణు దేశాయ్. తాను కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ కారు ఫోటోని కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. 

మునుపటి వ్యాసంఆ ప్రశ్న అనుష్కని అడగలేదా ?
తదుపరి ఆర్టికల్సంజయ్ దత్ కు క్యాన్సర్ ?
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి